గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. బీజేపీ నేతలు కిషన్రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డిలతోపాలు పలువురు ప్రముఖులు మోడీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన నగరంలోని పార్క్హయత్ హోటల్ చేరుకున్నారు. నగరంలోని ఎల్ బీ స్టేడియంలో ఈ రోజు మధ్నాహ్నం జరగనున్న నవభారత్ యువభేరి సదస్సులో మోడీ పాల్లొని ప్రసంగించనున్నారు. దేశంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ప్రచార కమిటీ సారథ్య బాధ్యతలను భారతీయ జనతాపార్టీ అధిష్టానం మోడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసేందుకు దేశావ్యాప్తంగా వివిధ నగరాల్లో మోడీ 100 సభల్లో పాల్గొనున్నారు. అందులోభాగంగా హైదరాబాద్లో ఈ రోజు ఏర్పాటు చేసిన నవభారత్ యువభేరి సభ మొట్టమొదటిది.
Aug 11 2013 10:55 AM | Updated on Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement