జీఎస్టీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎట్టకేలకు ఏకాభిప్రాయం కుదిరింది. 90 శాతం చిన్న స్థాయి పన్ను చెల్లింపుదారులపై నియంత్రణను రాష్ట్రాలకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించడంతో ఇంతకాలం కొనసాగిన ప్రతిష్టంభనకుతెరపడింది. ఇదే సమయంలో జీఎస్టీని ఏప్రిల్ 1 నుంచి కాకుండా జూలై 1 నుంచి అమలు చేయాలని మండలి నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ అమలు తేదీపై సోమవారం జైట్లీ నేతృత్వంలోని మండలి సమావేశమైంది. అనంతరం ఆయన మీడియాతోమాట్లాడుతూ.. జీఎస్టీ అమలు తేదీని మూడు నెలలు వాయిదా వేసినట్లు చెప్పారు. ఐజీఎస్‌టీ చట్టం ముసాయిదాల అనుమతి తదితరాల కోసం జీఎస్టీ మండలి తదుపరి సమావేశం వచ్చే నెల 18న జరగనుందని తెలిపారు.