రాజధాని నిర్మాణం పేరిట రైతుల నుంచి బలవంతంగా వేలాది ఎకరాల భూములు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం.. కోర్టు వివాదంలో ఉన్న భూములను సైతం లాక్కునేందుకు ప్రయత్నిస్తోంది. రైతుల ఆవేదనను పట్టించుకోకుండా పచ్చని పంట పొలాలు ధ్వంసం చేస్తోంది. రోడ్డు నిర్మాణం కోసం కోట్లాది రూపాయల విలువైన జరీబు భూముల్లో యంత్రాలను దింపి చదును చేయిస్తోంది. సోమవారం వెంకటపాలెం గ్రామానికి చెందిన భూములను సీఆర్డీఏ అధికారుల సహకారంతో చదును చేసేందుకు కాంట్రాక్టర్లు యత్నించారు. లంక శ్రీకాంత్‌కు చెందిన 4 ఎకరాలను భూమిని చదును చేసేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న గ్రామస్తులు ప్రతిఘటించడంతో అధికారులు, కాంట్రాక్టర్లు వెనుదిరిగారు.