పైలిన్ తుపాన్ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో సహాయక చర్యలు కోసం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి రవిచంద్ర శనివారం కాకినాడు చేరుకోనున్నారు. ఆయన ఈ రోజు ఉదయం కాకినాడ కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. దాంతో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ అధికారులు అప్రమత్తమైయ్యారు. అలాగే కాకినాడ ఓడరేవులో 3వ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు. కాకినాడ కలెక్టరేట్, అమలాపురం ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తుపాన్ వల్ల విపత్కర పరిస్థితులు ఎదురైతే వెంటనే 0884-2365506,0884-1077,08856 233100 లేదా ఇండియన్ కోస్ట్ గార్డ్ -1554, మెరైన్ పోలీస్ 1093లకు ఫోన్ చేయాలని అధికారులు వివరించారు. అలాగే జిల్లాలో గోదావరి డెల్టా కింద 4.50 లక్షల ఎకరాల్లో వరి సాగువుతోంది. తుపాన్ వల్ల భారీ వర్షాలు కురిస్తే 2.50 లక్షల ఎకరాల్లోని ఖరీఫ్ పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దాంతో జిల్లాలోని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Oct 12 2013 10:21 AM | Updated on Mar 21 2024 8:50 PM
Advertisement
Advertisement
Advertisement
