సమైక్యాంధ్రకు మద్దతుగా రెండోరోజు కూడా వైఎస్ఆర్ సీపీ రహదారుల దిగ్బంధం కొనసాగుతోంది. సీమాంధ్ర జిల్లాల్లో వైఎస్ఆర్ సీపీ రహదారులను దిగ్బందిస్తున్నారు. నేతలు నిన్న పోలీసుల ఒత్తిళ్లు అరెస్టులకు తలొగ్గకుండా రహదారులను దిగ్భందించిన బెజవాడ వాసులు గురువారం కూడా కదం తొక్కారు. విభజన ప్రకటన ఆగే వరకు రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తొమ్మిదో నంబర్ జాతీయ రహదారిపై ఇబ్రహీం పట్నం వద్ద భైఠాయించారు. దీంతో హైదరాబాద్ విజయవాడల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఝాం అయింది. విద్యార్థులు, మహిళలు కూడా స్వచ్ఛందంగా దిగ్భందనంలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం క్రిష్టవరం టోల్‌ప్లాజా వద్ద వైఎస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. అర్ధరాత్రి జాతీయ రహదారిపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గ నాయకుడు జ్యోతుల నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే జిల్లాలో దిండి-చించినాడ బ్రిడ్జిపై మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు, బొంతు రాజేశ్వరరావు, మత్తి జయప్రకాష్ ఆధ్వర్యంలో ఎన్హెచ్ 216ను వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు దిగ్బంధించారు. దాంతో వాహనాలు నిలిచిపోయాయి. అలాగే నగరంలోని ఓఎన్జీసీ రిఫైనరీ ఎదుట వైఎస్ఆర్ సీపీ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, వేణుగోపాలరావు, మందపాటి కిరణ్కుమార్ ఆధ్వర్యంలో దిగ్బంధం చేశారు. ముమ్మడివరంలో గుత్తుల సాయి ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధంతో ట్రాఫిక్ స్తంభించింది.
Nov 7 2013 12:02 PM | Updated on Mar 21 2024 5:15 PM
Advertisement
Advertisement
Advertisement
