బడ్జెట్‌లో కార్పొరేట్‌ పన్నుల కోత! | Cut corporate taxes in the budget! | Sakshi
Sakshi News home page

Jan 31 2017 6:44 AM | Updated on Mar 21 2024 8:43 PM

వచ్చే బడ్జెట్‌లో కార్పొరేట్‌ పన్ను కోతలు ఉండే అవకాశం ఉందని బ్రిటన్ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ (యూకేఐబీసీ), బ్రిటన్ పారిశ్రామిక సమాఖ్య (సీబీఐ)లు అంచనా వేస్తున్నాయి. దీనితోపాటు సరళతర, సంక్లిష్టతలకు తావులేని పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టాలని తద్వారా భారత్‌లో బ్రిటన్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి విజ్ఞప్తి చేశాయి. అలాగే వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)ని పటిష్టంగా, ఎటువంటి అవాంతరాలూ లేకుండా అమలు చేయాలని కోరుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపాయి. దీనివల్ల దేశంలో వ్యాపార విశ్వాసం మెరుగుపడుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, దేశీయ పెట్టుబడులు మెరుగుపడతాయని వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement