రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు కలిపి 7,548 ఏటీఎం మిషన్లున్నా యి. రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత కొత్తగా అందుబాటులోకి వచ్చిన రూ.2 వేల నోట్లను ఏటీఎం మిషన్ల ద్వారా పంపిణీ చేసే అవకాశం లేకుండా పోయింది. సాంకేతిక సమస్యలు అధిగమించడంతో పాటు రాష్ట్రంలో ఇప్పటివరకు 4 వేల ఏటీఎంలలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ప్రక్రియ పూర్తయింది. కానీ వీటన్నిటి ద్వారా నగదు పంపిణీ జరగడం లేదు. బ్యాంకుల వద్ద నగదు కొరతతో ఏటీఎం కేంద్రాలు తెరుచుకోవడం లేదు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఏటీఎంలను పరిశీలించగా.. చాలాచోట్ల ‘నో క్యాష్ బోర్డు’లు కనిపించాయి.