నమ్ముకున్నవాళ్లను నట్టేట ముంచడం చంద్రబాబుకు ముందునుంచి ఉన్న అలవాటేనని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారని, ఆయన మంచి విలువలు, క్రమశిక్షణ కలిగిన నాయకుడని.. చివరకు అలిపిరిలో బాంబుదాడి జరిగినప్పుడు కూడా చంద్రబాబు వెంటే ఉన్నారని గుర్తుచేశారు.