ముగిసిన సండ్ర ఏసీబీ కస్టడీ | Cash For Vote || 2nd Day of Sandra Investigation was Completed | Sakshi
Sakshi News home page

Jul 10 2015 3:20 PM | Updated on Mar 21 2024 7:54 PM

ఓటుకు కోట్లు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రెండో రోజు ఏసీబీ కస్టడీ ముగిసింది. శుక్రవారం ఏసీబీ అధికారులు సండ్రను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేయించిన అనంతరం సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఓటుకు కోట్లు కేసులో సండ్రను రెండు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. గురువారం కూడా ఏసీబీ అధికారులు సండ్రను విచారించారు. ఈ రోజుతో సండ్ర ఏసీబీ కస్టడీ ముగిసింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement