కోడి పందేల నిర్వహణకు హైకోర్టు బ్రేక్‌ | Break of the High Court to contest Sankranti | Sakshi
Sakshi News home page

Dec 27 2016 7:37 AM | Updated on Mar 22 2024 11:06 AM

కోడి పందేల నిర్వహణకు ఉమ్మడి హైకోర్టు బ్రేక్‌ వేసింది. సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా కోడి పందేలు నిర్వహించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.ఈ పందేలకు ప్రజా ప్రతినిధులు హాజరవుతుండటాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. చట్టాలను చేసే వారే వాటిని ఉల్లంఘిస్తూ, ఇతరులకూ చట్ట ఉల్లంఘనలకు పాల్పడే ధైర్యాన్నిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. కోడి పందేలు జరగకుండా చూసేందుకు ముఖ్యంగా తూర్పు , పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సంయుక్త పరిశీలన బృందాలను ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ బృందంలో ఎస్‌ఐ స్థాయికి తగ్గని అధికారి, తహసీల్దార్, జంతు సంక్షేమ బోర్డు ప్రతినిధి లేదా స్వచ్ఛంద సంస్థ సభ్యుడుగానీ ఉండాలంది. వీటిని జనవరి 7, 2017లోపు ఏర్పాటు చేయాలని, ఈ బృందానికి ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ ఫోటోగ్రాఫర్‌ సహకారం అందించేలా చూడాలంది.కోళ్ల పందేలకు ఉద్దేశించిన ఏ ప్రాంతాన్నైనా సందర్శించేందుకు ఈ బృందాలకు అధికారం ఉందన్న హైకోర్టు, పందేలకు సిద్ధం చేసిన కోళ్లను, డబ్బును జప్తు చేయవచ్చునంది.

Advertisement
 
Advertisement
Advertisement