ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి దారుణానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలో సోమవారం రాత్రి కిడ్నాప్కు గురైన నలుగురు పోలీసు ఉన్నతాధికారులను మావోయిస్టులు చంపేశారు. సదరు పోలీసు మృతదేహాలను బుధవారం ఉదయం స్థానికులు కనుగొని పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నాలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్కు గురైన ప్రాంతానికి కేవలం 5 కి.మీ దూరంలో వీరి మృతదేహాలను స్థానికులు కనుగోన్నారు. బీజాపూర్ జిల్లాలో కుట్రూకి వెళ్తున్న బస్సును మావోయిస్టులు సోమవారం రాత్రి అడ్డగించి... అందులో ప్రయాణిస్తున్న నలుగురు పోలీసులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని ఛత్తీస్గఢ్ డీజీపీ అమర్నాథ్ ఉపాధ్యాయ సోమవారం రాత్రి ప్రకటించారు. అయితే కిడ్నాప్ గురైన పోలీసు సిబ్బంది కోసం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు డీజీపీ అమరనాథ్ వెల్లడించారు. కుట్రూ పరిసర ప్రాంతాలలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉంటుంది.
Jul 15 2015 12:38 PM | Updated on Mar 21 2024 8:30 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement