తమ పార్టీ కార్యకర్తలను టీడీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలకు ఇళ్లు కేటాయించడం లేదని, సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత‍్వం మంజూరు చేసే ఇళ్లను కూడా తమ పార్టీ శ్రేణులకు ఇవ్వడం లేదని, వాటికి ఎన్టీఆర్ పేరు పెడుతున్నారని విమర్శించారు.