డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌పై ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా దాడి చేయించిందా? ఈ ప్రశ్నకు డీఎంకే నాయకులు అవుననే అంటున్నారు. మార్షల్స్ ముసుగులో నిబంధనలు ఉల్లంఘించి తొమ్మిది మంది ఐపీఎస్‌లు తమిళనాడు అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే ఇందుకు బలమైన రుజువని చెబుతున్నారు.