ఏటీఎంలలో నగదు విత్డ్రా పరిమితిపై ఆర్బీఐ ప్రజలకు గుడ్న్యూస్ చెప్పింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం విధించిన విత్డ్రా పరిమితిని మరికొంత సడలించి, రోజుకు రూ. 10వేల వరకు విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తున్నట్టు తెలిపింది. ఇన్ని రోజుల వరకు ఏటీఎంలలో విత్డ్రా పరిమితి రోజుకు రూ.4500 మాత్రమే ఉండేది. అయితే వారానికి బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసుకునే పరిమితుల్లో ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు.