స్విస్ చాలెంజ్‌పై ఏపీ సర్కారు యూటర్న్ | ap government takes u turn in swiss challenge issue | Sakshi
Sakshi News home page

Oct 26 2016 4:28 PM | Updated on Mar 22 2024 11:06 AM

స్విస్ చాలెంజ్ విధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. రాజధాని నిర్మాణానికి అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై హైకోర్టు హైకోర్టు డివిజన్ బెంచి ఎదుట దాఖలుచేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. చట్టంలో ప్రభుత్వం అనేక మార్పులు చేసిందని, ఆ మార్పులకు అనుగుణంగా మళ్లీ తాజా నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. మరి సింగిల్ బెంచి లేవనెత్తిన అంశాల మాటేంటని బెంచి ప్రశ్నించగా, ఆయన మౌనం వహించారు. తాజా నోటిఫికేషన్ గనుక కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఉంటే మళ్లీ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషన్‌కు కోర్టు సూచించింది.

Advertisement
 
Advertisement
Advertisement