పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత (డిజిటల్) లావాదేవీల అమలుపై అధ్యయనానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కన్వీనర్‌గా నీతి ఆయోగ్ బుధవారం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో వివిధ పార్టీలకు చెందిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సంబంధిత అంశంలో నిపుణులు మొత్తం 13 మంది ఉన్నారు. ఒడిశా, మధ్యప్రదేశ్, సిక్కిం, పుదుచ్చేరి, మహారాష్ట్రల ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, శివ్‌రాజ్ సింగ్ చౌహాన్, పవన్ కుమార్ చామ్లింగ్, వి.నారాయణ స్వామి, దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా కమిటీలో సభ్యులుగా ఉంటారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) మాజీ చైర్మన్ నందన్ నిలేకని, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ చైర్మన్ జన్మేజయ సిన్హా, నెట్‌కోర్ మేనేజింగ్ డెరైక్టర్ రాజేశ్ జైన్, ఐ స్పిరిట్ సహ వ్యవస్థాపకుడు శరద్ శర్మ , ఐఐఎం (అహ్మదాబాద్) ఫ్రొఫెసర్ (ఫైనాన్‌స) డాక్టర్ జయంత్ వర్మ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.
Dec 1 2016 7:28 AM | Updated on Mar 21 2024 10:47 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement