కాంగ్రెస్ కోర్ కమిటీకి నేడు ఆంటోనీ కమిటీ నివేదిక సమర్పించనుంది. రాష్ట్ర విభజన ప్రకటనతో తలెత్తిన సమస్యలు... వాటి సంప్రదింపుల వివరాలపై కాంగ్రెస్ కోర్ కమిటీ ఈ సందర్భంగా చర్చించనుంది. మరోవైపు తెలంగాణపై కేబినెట్ నోట్ సిద్ధమైందని కేంద్ర ఉన్నతాధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.