వచ్చే ఎన్నికల్లో పొత్తుల వ్యవహారాన్ని ఆంటోనీ కమిటీ చేసుకుంటుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఆంటోనీ కమిటీలో తాను సభ్యుడిని కాదని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. పార్టీఆలతో పొత్తు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని దిగ్విజయ్ అన్నారు. రాజ్యసభ ఎన్నికలపై ప్రస్తుతం దృష్టి సారిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా తెలంగాణ ప్రకటన అనంతరం సీమాంధ్ర ప్రాంతంలో చెలరేగిన ఆందోళనలను చల్లార్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Jan 15 2014 3:39 PM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement