మహిళలను కించపరిచేలా నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలను ‘సూపర్..’ అంటూ పొగిడిన యాంకర్ రవి.. తన చర్యను సమర్థించుకున్నాడు. నిర్వాహకుల సూచన మేరకు.. ఫన్(హాస్యం) కోసమే ‘అమ్మాయిలు హానికరం..’ డైలాగ్‌ను హైలైట్ చేశామని చెప్పాడు. లేడీ యాంకర్ ప్రశ్నకు నటుడు చలపతిరావు చెప్పిన సమాధానం అసలు వినబడనేలేదని, కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో క్యాజువల్‌గా ‘సూపర్..’ అన్నానని వివరణ ఇచ్చాడు