మెరీనా బీచ్‌లో జయలలిత సమాధి వద్ద నివాళులర్పించేందుకు వచ్చిన వందలాది మంది అభిమానులకు బుధవారం సాయంత్రం ఒకింత ఉద్వేగపూరితమైన అనుభవం ఎదురైంది. జయలలితకు శ్రద్ధాంజలి ఘటించేందుకు వచ్చిన ఆమె మేనకోడలు దీపను చూసి.. 'అమ్మ' అభిమానులు చూపు తిప్పుకోలేకపోయారు. దీప అచ్చం జయలలిత పోలికలతో ఉండటంతో ఆమెను చూసి కొందరు ఉద్వేగానికి లోనయ్యారు.