దేశమంతటా నేడు ఓటరు దినోత్సవం జరుపుకుంటున్న 95 ఏళ్ల బామ్మ చూపిన స్ఫూర్తి చర్చనీయాంశమైంది. జల్‌దేవీ అనే ఈ వృద్ధ మహిళ.. ఉత్తరప్రదేశ్‌లోని ఖేరాఘర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నది. ఈమేరకు బుధవారం ఉదయం ఆగ్రాలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్‌ను దాఖలుచేసింది. చక్రాలకుర్చీలో వచ్చిన ఆమెను చూసి అధికారులు తొలుత ఆశ్చర్యపోయినా, ఆమె స్ఫూర్తిని గౌరవించారు. అవసరమైన సూచనలు ఇస్తూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయించారు.