ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజెస్ కమిటీ ఎదుట అయిదుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్‌కే) మంగళగిరి), బూడి ముత్యాల నాయుడు (మాడుగుల), డాక్టర్ ఎం.సునీల్ కుమార్ (పూతలపట్టు), కిలేటి సంజీవ య్య (సూళ్లూరుపేట), కంబాల జోగులు(రాజాం) బుధవారం కమిటీ ఎదుట హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు. గత అసెంబ్లీ సమావేశాల‍్లో జరిగిన పరిణామాలపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. మరోవైపు వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నానని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రివిలేజ్ కమిటీకి సమాచారం ఇచ్చారు.
Oct 26 2016 1:39 PM | Updated on Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement