గ్రూప్2–1999 నోటిఫికేషన్‌కు సంబంధించిన పోస్టుల్లో కొన్నిటిని ప్రభుత్వం దారిమళ్లించిందా? 17 ఏళ్లుగా ఆ పోస్టులకోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో ఇప్పుడివే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల నియామక నిబంధనల్లోని రూల్ 7 కింద (క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ మెరిట్) మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థులకు దక్కాల్సిన పోస్టులను వారికి ఇవ్వకుండా ఇటీవల జారీచేసిన కొత్త నోటిఫికేషన్లోకి ప్రభుత్వందారి మళ్లించినట్లుగా కనిపిస్తోందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఆ పోస్టులను పాత వారితో భర్తీచేసే కన్నా కొత్తగా భర్తీ చేస్తే ప్రస్తుతం తమ హయాంలో భర్తీ అయినట్లు చెప్పుకోవడానికే అలా దారి మళ్లించినట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇప్పటివరకు అధ్వానంగా మారిన ఈ 1999 గ్రూప్2 పోస్టుల భర్తీ వ్యవహారానికి అప్పుడు... ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని మండిపడుతున్నారు. నోటిఫికేషన్ వెలువడిన 1999లో, ఇప్పుడూ చంద్రబాబు ప్రభుత్వమే ఉందని గుర్తు చేస్తున్నారు.
Dec 27 2016 7:41 AM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement