సాధారణంగా ఎవరినైనా విమర్శించడానికి మాత్రమే తన ట్విట్టర్ ఖాతాను ఉపయోగించుకునే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ప్రత్యేక హోదా ఉద్యమం గురించి స్పందించారు. విశాఖపట్నంలో నిర్వహించదలచిన శాంతియుత ప్రదర్శన విషయంలో వైఎస్ జగన్ అసలైన నిబద్ధతను, అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారని చెప్పారు. గురువారం విశాఖలో తలపెట్టిన నిరసన ప్రదర్శనలకు తనవంతు మద్దతు ప్రకటించేందుకు వచ్చిన ఆయనకు 'హ్యాట్సాఫ్' అని ట్వీట్ చేశారు.