సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా మరోసారి వివాదస్పదంగా మారింది. ఆయన తాజా చిత్రం 'సావిత్ర'పై వివాదం రేగుతోంది. సావిత్రి సినిమా పోస్టర్పై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. సినిమా పోస్టర్పై కమిషన్... సుమోటో కింద కేసును స్వీకరించింది. సావిత్రి పేరుతో ఓ టీచర్ అందాలను ఓ కుర్రాడు తొంగి తొంగి చూస్తూ ఉన్న స్టిల్స్ వివాదానికి కారణం అయ్యాయి. దర్శకుడు రాంగోపాల్ వర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.