మెగా హీరో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ 'కాటమరాయుడు' మూవీ ప్రమోషన్లో భాగంగా 'మిరా మిరా మీసం.. మెలి తిప్పాడు జనం కోసం' అనే పాటను మూవీ యూనిట్ విడుదల చేసింది. పవన్ కల్యాణ్ ముందుగానే చెప్పినట్లుగానే శుక్రవారం సాయంత్రం సాంగ్ ఆడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాట కొన్ని నిమిషాల్లోనే భారీ వ్యూస్ తో దుమ్మురేపుతోంది. నేటి నుంచి మూడు రోజులకో పాట చొప్పున పాటలను రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేసింది.