నల్లధనం కేసుల్లో విచారణను ఆదాయపన్ను శాఖ వేగవంతం చేసింది. జనవరి చివరి నాటికి దేశవ్యాప్తంగా పన్ను ఎగవేతలకు సంబంధించిన కేసుల్లో 570 చార్జ్‌షీట్లను దాఖలు చేసింది. ఆపరేషన్ క్లీన్ మనీ కార్యక్రమంలో గుర్తించిన భారీ డిపాజిట్లకు సంబంధించి తీవ్రమైన అవకతవకలు జరిగిన కేసులను విడిచిపెట్టవద్దని... ఆయా సంస్థలు, వ్యక్తులపై కోర్టుల్లో చార్జ్‌షీట్లను దాఖలు చేయాలని క్షేత్రస్థాయి ఉద్యోగులకు ఆదేశాలందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఎగవేతలకు సంబంధించి కోర్టుల్లో దాఖలైన చార్జ్‌షీట్లు 196 కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికే అవి మూడు రెట్లు పెరిగి 570కు చేరాయి.
Mar 16 2017 7:28 AM | Updated on Mar 20 2024 5:03 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement