Operation Clean Money
-
ఐటీ రంగం పటిష్టంగానే...
పనితీరు మదింపు ప్రక్రియలో భాగంగానే ఉద్యోగుల తొలగింపులు ఐటీ కార్యదర్శి అరుణ సుందరరాజన్ న్యూఢిల్లీ: ఐటీ కంపెనీల్లో భారీగా ఉద్యోగుల తొలగింపుపై నెలకొన్న ఆందోళనను తొలగించే దిశగా కేంద్రం రంగంలోకి దిగింది. ఐటీ రంగం పటిష్టంగానే ఉందని, వాస్తవానికి సాదా సీదా సర్వీసుల నుంచి అత్యధిక నైపుణ్యం గల సేవలవైపు మళ్లుతోందని కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ పేర్కొన్నారు. పనితీరు మదింపు ప్రక్రియలో భాగంగా కొందరు ఉద్యోగుల కాంట్రాక్టులను పునరుద్ధరించకపోవడం సాధారణంగా ఏటా జరిగేదేనని, ఈ ఏడాదీ అదే జరుగుతోంది తప్ప అసాధారణ చర్యలేమీ తీసుకోవడం లేదని ఐటీ కంపెనీలు తనకు వివరించినట్లు ఆమె తెలిపారు. ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ తదితర ఐటీ దిగ్గజాలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయన్న ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఆపరేషన్ క్లీన్ మనీ – 2
-
ఆపరేషన్ క్లీన్ మనీ – 2
► 60 వేల మందికి నోటీసులు ► నల్లధన అక్రమార్కులపై ఐటీ కొరడా న్యూఢిల్లీ: నల్లధన అక్రమార్కులపై ఐటీ శాఖ విరుచుకుపడుతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ పేరిట రెండో దశ చర్యలకు శుక్రవారం శ్రీకారం చుట్టింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో 1,300 మంది అత్యంత అనుమానిత వ్యక్తులతో సహా 60 వేల మందికి పైగా వ్యక్తులు, సంస్థలు భారీగా నగదు లావాదేవీలు జరిపినట్లు గుర్తించామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) తెలిపింది. వీరికి ఆన్లైన్లో నోటీసులు పంపనున్నారు. అత్యధిక నగదు డిపాజిట్లు చేసిన ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, విలువైన ఆస్తులను కొనుగోలు చేసిన వ్యక్తులు, సంస్థలపై విచారణ చేపడతామన్నారు. ఆపరేషన్ తొలిదశలో స్పందించని వారిపైనా విచారణ ఉంటుందన్నారు. అనుమానితులెవ్వరినీ తాజా ఆపరేషన్‌లో వదలమని స్పష్టం చేశారు. నోట్ల రద్దు ప్రకటన తర్వాత అంటే 2016, నవంబర్ 9 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు రూ. 9,334 కోట్లకు పైగా నల్లధనాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ మనీ తొలి దశలో ఐదు లక్షలకు పైగా డిపాజిట్లు చేసిన 17 లక్షలకు పైగా అనుమానిత ఖాతాదారులకు ఐటీ శాఖ ఎస్సెమ్మెస్ – ఈ మెయిల్స్ ను పంపించింది. బెంగళూరులో 15 కోట్ల పాత కరెన్సీ సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని ఓ మాజీ కార్పొరేటర్ ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించగా రూ. 14.80 కోట్ల పాత కరెన్సీ లభ్యమైంది. ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. నాగరాజు అలియాస్ బాంబ్‌నాగ బెంగళూరులోని శ్రీరాంపురలో మూడంతస్తుల ఇంట్లో ఉంటున్నాడు. కిడ్నాప్, బెదిరింపుల కేసు విషయమై ఇతనిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా నోట్ల వ్యవహారం బయటపడింది. బాంబ్‌నాగ ఇంటితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేయగా పాత రూ. 500, రూ. 1,000 నోట్లు బయటపడ్డాయి. 10 బాక్సులు, 3 బ్యాగుల్లో నోట్ల కట్టలు పేర్చి వాటిపై పరువును ఉంచారు. నోట్లు లెక్కించే యంత్రాలను తెప్పించి శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం పొద్దు పోయే వరకూ లెక్కించారు. -
నల్లధనంపై ఐటీ కఠిన చర్యలు
-
నల్లధనంపై ఐటీ కఠిన చర్యలు
న్యూఢిల్లీ: నల్లధనం కేసుల్లో విచారణను ఆదాయపన్ను శాఖ వేగవంతం చేసింది. జనవరి చివరి నాటికి దేశవ్యాప్తంగా పన్ను ఎగవేతలకు సంబంధించిన కేసుల్లో 570 చార్జ్షీట్లను దాఖలు చేసింది. ఆపరేషన్ క్లీన్ మనీ కార్యక్రమంలో గుర్తించిన భారీ డిపాజిట్లకు సంబంధించి తీవ్రమైన అవకతవకలు జరిగిన కేసులను విడిచిపెట్టవద్దని... ఆయా సంస్థలు, వ్యక్తులపై కోర్టుల్లో చార్జ్షీట్లను దాఖలు చేయాలని క్షేత్రస్థాయి ఉద్యోగులకు ఆదేశాలందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఎగవేతలకు సంబంధించి కోర్టుల్లో దాఖలైన చార్జ్షీట్లు 196 కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికే అవి మూడు రెట్లు పెరిగి 570కు చేరాయి. ఆదాయపన్ను చట్టం కింద పన్ను నేరాల్లో కోర్టు దోషిగా నిర్ధారిస్తే ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కోర్టుల్లో దాఖలు చేసిన 570 కేసుల్లో అధిక శాతం సెక్షన్ 276 సీఈ (ఆదాయ రిటర్నులు దాఖలు చేయకపోవడం), సెక్షన్ 276బీ (టీడీఎస్‌ను డిపాజిట్ చేయకపోవడం), సెక్షన్ 276సీ(1) (ఉద్దేశపూర్వక పన్ను ఎగవేత) కింద ఉన్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. హెచ్ఎస్బీసీ బ్యాంకు జాబితా, ఐసీఐజే, పనామా పేపర్లలో ఉన్న వారి కేసులూ ఇందులో ఉన్నాయి. ఇక, పన్ను ఎగవేతలకు పాల్పడిన వారి నుంచి కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్స్ కోరుతూ 1,195 దరఖాస్తులు ఆదాయపన్ను శాఖకు వచ్చాయి. -
అనుమానాస్పద డిపాజిట్లపై త్వరలో చర్యలు!
-
ఆ 18 లక్షల్లో సగం మందిపై అనుమానమే!
• నోట్ల రద్దు అనంతర డిపాజిటర్లపై ఐటీ శాఖ • మార్చి 31 తరువాత చర్యలు ఉంటాయని సూచన న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ కింద 9 లక్షల మంది అకౌంట్లు అనుమానాస్పదంగా ఉన్నాయని ఐటీ శాఖ తెలిపింది. ఆయా అకౌంట్ హోల్డర్లు అందరిపై కొత్త పన్ను క్షమాభిక్ష పథకం–పీఎంజీకేవై ముగిసిన తర్వాత (మార్చి 31) చర్యలు ఉంటాయని కూడా పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం అకౌంట్లలో రూ.5 లక్షల దాటి రద్దయిన నోట్లు డిపాజిట్ అయిన మొత్తాలకు సంబంధించి ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ కింద 18 లక్షల మందికి ఐటీ శాఖ ఈ–మెయిల్, ఎస్ఎంఎస్ సందేశాలను పంపుతూ సమాధానాలను కోరిన సంగతి తెలిసిందే. దీనికి తుది గడువు ఫిబ్రవరి 15తో ముగిసింది. వీరిలో దాదాపు 5.27 లక్షల మంది అసెస్సీలు ఫిబ్రవరి 12వ తేదీ నాటికే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఎస్ఎంఎస్, ఈ–మెయిల్స్‌కు ఎటువంటి చట్టబద్దతా ఉండదు. దీంతో అనుమానాస్పద డిపాజిట్‌దారులకు మళ్లీ తగిన చట్టబద్దమైన నోటీసులు జారీ చేసి ఐటీ శాఖ వివరణ కోరనుంది. నల్లకుబేరులకు ఆఖరి క్షమాభిక్ష పథకం పీఎంజీకేవై మార్చి 31న ముగిసిన తర్వాత, అనుమానాస్పద డిపాజిట్ దారులపై సైతం ఐటీ చర్యలకు సిద్ధమవుతోంది. -
ఆపరేషన్ క్లీన్ మనీ: 9లక్షల ఖాతాలు సందేహాస్పదం
న్యూఢిల్లీ: 'ఆపరేషన్ క్లీన్ మనీ' ప్రక్రియలో ఇటీవల ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ ల ద్వారా వివరణకు ఇచ్చిన గడువు (ఫిబ్రవరి 15) ముగియడంతో తదుపరి చర్యలకు దిగుతోంది. ఈ మేరకు రద్దయిన నోట్ల డిపాజిట్లపై ఇటీవల గుర్తించిన 18 లక్షల అనుమానాస్పద ఖాతాల్లో దాదాపు సగం ఖాతాలపై ఆదాయపన్ను శాఖ అనుమానాలను వ్యక్తం చేసింది. 9 లక్షల ఖాతాల్లో బ్యాంకు డిపాజిట్లను 'సందేహాస్పదంగా' గుర్తించినట్టు ఐటీ శాఖ ప్రకటించింది. అయితే కొత్త పన్ను అమ్నెస్టీ పథకం మార్చి 31 న ముగిసిన అనంతరం ఈ ఖాతాలపై చర్యకు దిగనునున్నట్టు ప్రకటించింది. ఆపరేషన్ క్లీన్ మనీ లో భాగంగా డీమానిటైజేషన్ 50-రోజుల కాలంలో రూ.5 లక్షలకు పైన అనుమానాస్పద డిపాజిట్లపై ఈ మెయిల్స్, ఎస్ఎంఎస్ల ద్వారా 18 లక్షలమందిని ఆరాతీసింది. వీరిలో చాలా మంది ఫిబ్రవరి 12దాకా తమకు సమాధానాలు ఇచ్చినట్టు చెప్పింది. అయితే వీటికి సమాధానం చెప్పని ఖాతాదారులు , సరియైన న్యాయపరమైన వివరణ కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందని ఐటీ వర్గాలు ప్రకటించాయి. తమ నోటీసులకు ప్రత్యుత్తరం పంపనివారికి లేదా ఐటిఆర్ వెల్లడిపై ఉద్దేశపూర్వకంగా కట్టుకథలు చెప్పేవారిపై కచ్చితంగా చర్య తీసుకోబడుతుందన్నాయి. 2016-17 ఆదాయ రిటర్న్స్ తోనే సరిపోలనీ, లేదా గడచిన సంవత్సరాలలో ఆదాయంలో అసాధారణ పెరుగుదల ఉంటే వాటిని అక్రమ ఆస్తులు, లేదా నల్లధనం కింద పరిగణిస్తామని స్పష్టం చేశాయి. అలాగే ఇ-ఫైలింగ్ పోర్టల్ రిజిస్టర్ కాని సుమారు 4.84లక్షల పన్నుచెల్లింపుదారులకు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ఎస్ఎంఎస్ లు పంపినట్టు తెలిపింది. అయితే ఎస్ ఎంఎస్ ఇ-మెయిల్ చట్టపరమైన నేపధ్య లేని నేపథ్యంలో, అధికారిక నోటీసులు పంపడానికి, తదుపరి చర్యలు మార్చి 31 వరకు వేచి ఉంటామని తెలిపింది. ఆపై సందేహాస్పద డిపాజిట్లపై చర్యలుంటాయని తెలిపింది. ఆదాయ వెల్లడికి ఉద్దేశించిన పథకం ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం మార్చి 31 వరకు నడుస్తుంది కాబట్టి , ఈ లోపు సంపదను వెల్లడించి పన్నులు చెల్లించాస్తారా లేదా అనేది డిపాజిటర్లు తేల్చుకోవాలని పేర్కొంది. కాగా రద్దయిన నోట్ల డిపాజిట్లపై 18 లక్షల అనుమానాస్పద ఖాతాలను గుర్తించిన ఆదాయపన్ను శాఖ వివరణ ఇవ్వాల్సిందిగా ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ ల ద్వారా కోరింది. ఇందుకుగానుఫిబ్రవరి 15వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ఐటీ వారికి మరో అవకాశమిచ్చింది
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల్లో భారీగా డిపాజిట్ చేసిన వారికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఆ డిపాజిట్లపై ఫిబ్రవరి 10లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆ తేదీలను ప్రభుత్వం ప్రస్తుతం పొడిగించింది. నగదు డిపాజిట్లపై అసెసీలు అందించాల్సిన వివరాల తేదీలను మరో ఐదు రోజుల పాటు అంటే ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. ''నగదు డిపాజిట్లపై ఆన్లైన్ స్పందనలు తెలిపే టైమ్ లిమిట్స్‌ను పొడిగిస్తున్నాం. ఇప్పుడు ఆపరేషన్ క్లీన్ మనీపై 2017 ఫిబ్రవరి 15 వరకు మీ వివరాలను నమోదు చేసుకోవచ్చు'' అని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది. జనవరి 31న ఆదాయపు పన్ను శాఖ ' ఆపరేషన్ క్లీన్ మనీ' ని ప్రారంభించింది. దీని కింద పెద్ద నోట్ల రద్దు అనంతరం నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లో రూ.5లక్షలకు పైబడిన అనుమానస్పద డిపాజిట్లపై రూ.18 లక్షల మంది అసెసీలకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా వివిధ ప్రశ్నలను ఆదాయపు పన్నుశాఖ సంధించింది. వీరిని ఐటీ డిపార్ట్మెంట్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సమాధానాలు తెలుపాలని ఆదేశించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీ మొత్తంలో బ్యాంకుల్లో డిపాజిట్ అయిన సంగతి తెలిసిందే. రూ.2 లక్షల నుంచి రూ.80 లక్షల వరకున్న డేటాను, రూ.80 లక్షలకు పైనున్న డేటాను ప్రభుత్వం విభజించింది. నగదు డిపాజిట్ల డేటానే, అసెసీ ప్రొఫైల్స్‌తో ఆదాయపు పన్ను శాఖ సరిపోలుస్తూ... వాటిలో అనుమానస్పద డిపాజిట్లు ఏమైనా తేలితే వారికి ఎస్ఎంఎస్, ఈ-మెయిల్స్ ద్వారా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తోంది. -
ఆ డిపాజిట్లు అనుమానాస్పదం
‘ఆపరేషన్ క్లీన్ మనీ’ ప్రారంభించిన ఐటీ శాఖ ► 18 లక్షల మంది డిపాజిట్ల గుర్తింపు ► పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఈమెయిళ్లు, ఎస్ఎంఎస్లు న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో అనుమానాస్పద డిపాజిట్లు చేసిన 18 లక్షల మందిని ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. వీరిలో రూ.5 లక్షలకు మించి డిపాజిట్ చేసిన వారూ ఉన్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో వివరణ కోరుతూ ఐటీ అధికారులు వీరికి ఈమెయిళ్లు, ఎస్ఎంఎస్లు పంపనున్నారు. పది రోజుల్లోపు ఆన్ లైన్ లో వివరణ ఇవ్వకపోతే నోటీసులు, ఇతర చర్యలు ఉంటాయి. దీనికి సంబంధించిన ఐటీ శాఖ మంగళవారం ‘ఆపరేషన్ క్లీన్ మనీ’(స్వచ్ఛ ధన్ అభియాన్ ) ప్రాజెక్టును ప్రారంభించింది. నవంబర్ 8 తర్వాత.. ఆదాయానికి మించిన నగదు డిపాజిట్లు చేసిన వారికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఎలక్ట్రానిక్ మెసేజీలు పంపుతుంది. వారు ఐటీ శాఖకు చెందిన ఈ–ఫైలింగ్ పోర్టల్‌కు సమాధానాలు పంపాలి. ఆపరేషన్ క్లీన్ మనీ ఒక ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ అని, దీని ద్వారా డిపాజిటర్ల నుంచి సమాధానాలు రాబట్టి, అవసరమైతే చట్టపర చర్య తీసుకుంటామని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా వెల్లడించారు. ఈ ప్రక్రియ అంతా ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనే జరుగుతుందని, అధికారులు భౌతికంగా ప్రశ్నించరని స్పష్టం చేశారు. తొలి దశ కింద రూ. 5 లక్షలు డిపాజిట్ చేసిన వారికి, రూ. 3–5 లక్షల మధ్య అనుమానాస్పద డిపాజిట్లు చేసినవారికి, సరైన పన్ను రిటర్నులు చూపని వారికి సమాచారం పంపుతున్నామని సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర చెప్పారు. రూ.2 లక్షలకుపైగా డిపాజిట్ అయిన కోటి ఖాతాల వివరాలను సేకరించా మని, తొలిదశలో నవంబర్ 9–డిసెంబర్ 30 మధ్య పెద్ద మొత్తంలో డిపాజిట్ అయిన నగదు తనిఖీ నిర్వహిస్తున్నామన్నారు. పన్నుచెల్లింపుదారుల సమాధానాలు సరిగ్గా ఉంటే తనిఖీ పూర్తయిపోతుందని, వారు ఐటీ ఆఫీసుకు రావాల్సిన అవసరముండదన్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఐటీ శాఖ ఈ–పోర్టల్‌లో ఉన్నాయని, సమస్యలు ఉంటే 1800–4250–0025 నంబర్‌ను సంప్రదించాలని సీబీడీటీ తెలిపింది. 25 కోట్ల ఆస్తుల అటాచ్ బెంగళూరు: నోట్ల రద్దు తర్వాత జరిగిన మనీల్యాండరింగ్‌కు సంబంధించి కర్ణాటక రాష్ట్ర హైవే అభివృద్ధి విభాగ మాజీ చీఫ్ ప్రాజెక్ట్ అధికారి ఎస్సీ జయచంద్రకు చెందిన రూ. 25 కోట్ల ఆస్తులను ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం అటాచ్ చేసింది. ఆస్తుల్లో సాగు భూములు, 13 ఇళ్లు ఉన్నాయి. డిసెంబర్ లో అరెస్టయిన జయచంద్ర ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. డిసెం బర్లో జయచంద్ర ఇంటితోపాటు మరో ప్రభుత్వ సీనియర్ ఇంజనీర్ ఇంట్లో అధికారులు రూ. 5 కోట్ల నగదు, రూ. 2 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 20–35 శాతం కమీషన్ ఇచ్చి పాతనోట్లకు కొత్తనోట్లు తీసుకున్నారని ఈడీ పేర్కొంది.