‘ఆపరేషన్ క్లీన్ మనీ’ కింద 9 లక్షల మంది అకౌంట్లు అనుమానాస్పదంగా ఉన్నాయని ఐటీ శాఖ తెలిపింది. ఆయా అకౌంట్ హోల్డర్లు అందరిపై కొత్త పన్ను క్షమాభిక్ష పథకం–పీఎంజీకేవై ముగిసిన తర్వాత (మార్చి 31) చర్యలు ఉంటాయని కూడా పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం అకౌంట్లలో రూ.5 లక్షల దాటి రద్దయిన నోట్లు డిపాజిట్ అయిన మొత్తాలకు సంబంధించి ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ కింద 18 లక్షల మందికి ఐటీ శాఖ ఈ–మెయిల్, ఎస్‌ఎంఎస్ సందేశాలను పంపుతూ సమాధానాలను కోరిన సంగతి తెలిసిందే.