కడప సెవెన్‌రోడ్స్ : మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలను ముందుగానే గుర్తించి, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టా లని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సూచించారు. సోమ వారం కలెక్టరేట్ సభాభవన్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీ నిధీమీనా తో కలిసి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు అలసత్వం వీడి ప్రతి అర్జీపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్‌ల సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు తెలిపారు. తహసీల్దార్లు, శాఖాధిపతులు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి, సమాచార లోపాలు లేకుండా చూడాలని సూచించారు.
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు!
మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, సబ్ కలెక్టర్ హెచ్‌ఎస్ భావన, జిల్లా రెవెన్యూ అధికారి కె.మల్లికార్జునుడుతో కలిసి కడప నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల విధులు కేటాయించిన అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నద్ధతపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఓటరు జాబితాల ప్రచురణకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. బ్యాలెట్ పెట్టెల సమీకరణ, బ్యాలెట్ పత్రాల ముద్రణకు అవసరమైన కాగితం సేకరణ, బ్యాలెట్ పత్రాల ముద్రణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఏర్పాటు వంటి అంశాలపై ముందస్తు కార్యాచరణ రూపొందించాలన్నారు.
పీజీఆర్‌ఎస్‌లో అధికారులతో కలెక్టర్


