చక్రాయపేట : స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు సమిష్టి కృషితో సత్తా చాటాలని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ సతీష్ కుమార్ రెడ్డితో కలిసి ఇడుపులపాయలో చక్రాయపేట మండల నేతలు కార్యకర్తలతో సమావేశం అయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రానుందన్నారు. ఇది అత్యంత కీలకమైన సమయం అని అందరూ ఐకమత్యంతో పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. రిజర్వేషన్‌ల ప్రక్రియ మేరకు అందరూ తగిన సర్టిఫికేట్‌లు కూడా సిద్ధం చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బెల్లం ప్రవీణ్ కుమార్ రెడ్డి,మాజీ ఎంపీపీ జెడ్పీటీసీలు మాదవీ బాలకృష్ణ, శివప్రసాదరెడ్డి, పలు విభాగాలకు చెందిన జిల్లా ప్రదాన కార్యదర్శులు ఈశ్వరరెడ్డి,రామాంజనేయరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రామాంజుల రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రసాదరావు, మల్లికార్జులనరెడ్డి పాల్గొన్నారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి


