సెలవుల్లో పాఠశాలలు నిర్వహించరాదు | - | Sakshi
Sakshi News home page

సెలవుల్లో పాఠశాలలు నిర్వహించరాదు

Oct 13 2026 1:29 AM | Updated on Oct 13 2026 1:29 AM

కడప ఎడ్యుకేషన్‌ : జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలు విద్యాశాఖ నిర్దేశించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను కచ్చితంగా పాటించాలని డీఈఓ షేక్‌ షంషుద్దీన్‌ ఆదేశించారు. దసరా సెలవుల సందర్భంగా ప్రకటించిన సెలవు రోజుల్లో ఏ పాఠశాలనూ నిర్వహించరాదని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి సెలవు రోజుల్లో పాఠశాలలు నిర్వహించే యాజమాన్యాలకు మండల విద్యాశాఖ అధికారులు, ఉప విద్యాశాఖ అధికారులు నోటీసులు జారీ చేసి, వివరణలు కోరడంతో పాటు, నిబంధనల ప్రకారం జరిమానాలు విధించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌కు రాష్ట్రపతి పోలీసు పతకం

రాజంపేట/కడప కోటిరెడ్డి సర్కిల్‌ : రైల్వేరక్షకదళం (ఆర్‌పీఎఫ్‌)లో విశిష్టసేవలందించిన ఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనరు కే.రాజగోపాల్‌డ్డి ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పోలీసు పతకాన్ని అందుకున్నారు. ఈ మేరకు ఆర్‌పీఎఫ్‌ వర్గాలు సోమవారం తెలియచేశాయి. ఛత్తీస్‌గడ్‌లోని రాయపూర్‌లో ఆర్‌పీఎఫ్‌ రైజింగ్‌డే వేడుకల్లో ఆర్‌పీఎఫ్‌ డీజీ సోనాలి మిశ్రా చేతుల మీదుగా ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. దశాబ్దాలుగా రైల్వే ఆస్తుల పరిరక్షణ, ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణకు గుర్తింపుగా ఈయనకు ఈ పురస్కారం దక్కింది.

సబ్సిడీ శనగలపై

రైతుల ఆందోళన

ప్రొద్దుటూరు : మండలంలోని చౌడూరు గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రం వద్ద సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. నిన్నటి వరకు ఎకరాకు 40 కిలోలు శనగలు ఇచ్చిన అధికారులు ఇప్పుడు డబ్బులు తీసుకుని 20 కిలోలు మాత్రమే ఇస్తామంటే ఎలా అని రైతులు ప్రశ్నించారు. సమాధానం చెప్పలేక వ్యవసాయ అధికారులు రైతు భరోసా కేంద్రానికి తాళం వేసి వెళ్లిపోయా రు. మార్కెట్‌లో శనగల ధరలు పెరిగాయని, ఈ రోజు నుంచి ఎకరాకు 20 కిలోలు చొప్పున మా త్రమే ఇస్తామని రైతు భరోసా కేంద్రానికి చెందిన అధికారులు ప్రకటించడంతో అప్పటికే క్యూలో ఉన్న రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగా రు. 20 కిలోలు ఇస్తే ఎలా సరిపోతాయని, పొలంలో ఏం విత్తగలమని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement