‘సోలార్‌’తో విద్యుత్‌ బిల్లులు మిగులు | - | Sakshi
Sakshi News home page

‘సోలార్‌’తో విద్యుత్‌ బిల్లులు మిగులు

Oct 9 2026 1:14 AM | Updated on Oct 9 2026 1:14 AM

కడప కార్పొరేషన్‌: ప్రధాన మంత్రి సూర్య ఘర్‌ ముఫ్తి బిజిలి యోజన పథకం ద్వారా సోలార్‌ రూఫ్‌ టాప్‌ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్‌ బిల్లులు మిగు లు ఉంటుందని కడప డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ హరిసేవ్యా నాయక్‌ అన్నారు. గురువారం కడప మానస కళ్యాణ మండపం వద్ద సేవా సేతు శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సోలార్‌ వెండార్లు, బ్యాంకు అధికారులతో కలిసి విద్యుత్‌ వినియోగదారులకు పీఎం సూర్య ఘర్‌ పథక ఆవశ్యకతను సోలార్‌ రూఫ్‌ టాప్‌ ఏర్పాటు చేసుకోవటం వలన విద్యుత్‌ బిల్లుల మిగులు గురించి వివరించారు. ప్రత్యేక ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి అందిన ఫిర్యాదులను పరిష్కరించారు. రూరల్‌ 1 సబ్‌ డివిజన్‌ ఏఈలు శివ ప్రసాద్‌ రెడ్డి, వేణు గోపాల్‌ రావు, ఆశా జ్యోతి, ఏఈ పురుషోత్తం, ఎనర్జీ సోలార్‌ వెండారు శేఖర్‌ పాల్గొన్నారు.

కడప డివిజన్‌ ఈఈ హరిసేవ్యా నాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement