27 దుకాణాలకు లైసెన్సుల కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

27 దుకాణాలకు లైసెన్సుల కేటాయింపు

Oct 9 2026 1:14 AM | Updated on Oct 9 2026 1:14 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు ప్రక్రియను నిబంధనల మేరకు పారదర్శకతతో నిర్వహిస్తున్నామని జేసీ నిధి మీనా పేర్కొన్నారు. గురువారం 2026–27 ఎకై ్సజ్‌ పాలసీ కింద ఏ4 మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపులో భాగంగా కలెక్టరేట్‌లో జేసీ సమక్షంలో లక్కీ డ్రా ప్రక్రియను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నోటిఫై చేసిన మొత్తం 60 మద్యం దుకాణాలకు లైసెన్సులకు లక్కీ డ్రా నిర్వహించగా .. 27 దుకాణాలకు లైసెన్సుల కేటాయింపు విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. నిబంధనల ప్రకారం, అర్హులైన దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ ప్రక్రియను నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ జయరాజు, జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి రమేష్‌, జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement