ప్రజలను నిండా ముంచిన కూటమి | - | Sakshi
Sakshi News home page

ప్రజలను నిండా ముంచిన కూటమి

Jun 14 2026 6:58 AM | Updated on Jun 14 2026 6:58 AM

ప్రజలను నిండా ముంచిన కూటమి

పులివెందుల రూరల్‌ : కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జనాలకు వెన్నుపోటు పొడిచిందని ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ధ్వజమెత్తారు. కోట్లాది రూపాయలు అప్పులు చేస్తున్నప్పటికి రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి కానీ, పరిశ్రమలు ఏర్పాటు గానీ చేయలేదని పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని స్థానిక భాకరాపురంలోని తన నివాసంలో ప్రజా దర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే వారిపై కేసులలో పెడుతున్నారని మండిపడ్డారు. రైతులను, నిరుద్యోగులను, మహిళలను ఇలా అన్ని వర్గాల వారిని కూటమి ప్రభుత్వం నిండా ముంచిందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు మంచి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్‌లో ప్రజల వినతులను స్వీకరించారు. వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

ప్రజా దర్బార్‌లో

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement