బాబు హుకుం.. ఖాకీ జులుం! | - | Sakshi
Sakshi News home page

బాబు హుకుం.. ఖాకీ జులుం!

Apr 9 2026 7:35 AM | Updated on Apr 9 2026 7:35 AM

బాబు హుకుం.. ఖాకీ జులుం!

రాధాకృష్ణపై వన్‌టౌన్‌లో ఫిర్యాదు

కడప కార్పొరేషన్‌: నిబంధనలకు నిలువెల్లా తూట్లు పొడుస్తూ.. ప్రజాస్వామ్య విలువలను పట్టపగలే బేఖాతరు చేస్తూ పోలీసులు జులుం ప్రదర్శించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను కించప రిచేలా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్య లను నిరసిస్తూ బుధవారం ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన ఆ పార్టీ నాయకులను ఖాకీలు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడికెక్కడ తెల్లవారుజాము నుంచే గృహ నిర్బంధం చేశారు. పోలీస్‌ స్టేషన్లకు తరలించి ఓవర్‌ యాక్షన్‌ చేశారు.

● తెల్లవారుజాము నుంచే మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్‌ పాకా సురేష్‌, ఎస్‌ఈసీ సభ్యులు యానాదయ్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్‌ బూసిపాటి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య తదితరులను గృహనిర్భంధం చేశారు. నాగరాజుపేటలో ఉన్న ఆంధ్రజ్యోతి కార్యాలయంపై ఈగ కూడా వాలనీకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు వేసి మూడంచెల భద్రత కల్పించారు. ఉదయం 9 గంటల నుంచే సన్‌రైజ్‌ హాస్పిటల్‌, మైత్రి హాస్పిటల్‌, బ్లూడైమండ్‌ హోటల్‌, శివశంకర్‌ హాస్పిటల్‌ల వద్ద బారికేడ్లు వేసి రాకపోకలను అడ్డుకున్నారు. సామాన్య ప్రజానీకాన్ని ఆసుపత్రులకు కూడా వెళ్లనీకుండా అడ్డుపడ్డారు. సుమారు 50 మందికిపైగా పోలీసులు, ఒక వ్యాన్‌, వజ్ర వాహనం, నాలుగైదు పెట్రోలింగ్‌ వాహనాలతో కాపు కాశారు. ఽ11.20 గంటలకు ధర్నా చేసేందుకు వచ్చిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, పార్టీ సీఈసీ సభ్యులు కె. సురేష్‌ బాబుల ఆధ్వర్యంలో వచ్చిన మాజీ డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ ఉమైర్‌, జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, నగర అఽధ్యక్షుడు గుంటి నాగేంద్ర, నగర మైనార్టీ అధ్యక్షుడు షఫీ, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్‌, ఈస్ట్‌ జోన్‌ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. రాధాక్రిష్ణ డౌన్‌, డౌన్‌, బూత్‌ ఛానెల్‌ ఏబీఎన్‌ డౌన్‌ డౌన్‌ అంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో వారిని బలవంతంగా పోలీస్‌వ్యాన్‌లో కుక్కి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

● అంతకుముందు ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్దకు ధర్నాకు వస్తున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, సీహెచ్‌ వినోద్‌, మల్లికార్జున కిరణ్‌, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎన్‌. శివరామ్‌, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండి దీప్తిరెడ్డి, మాజీ కో ఆప్షన్‌ సభ్యురాలు బి. మరియలు, పత్తిరాజేశ్వరి, చైతల్య, నారాయణమ్మ, మల్లీశ్వరి, పార్టీ నాయకులు త్యాగరాజు, అక్బర్‌ అలీ, కంచుపాటి బాబు తదితరులను లాక్కుంటూ వెళ్లి అరెస్ట్‌ చేశారు. బీసీ నేత శివరామ్‌ను వికలాంగుడని కూడా చూడకుండా ఈడ్చుకుంటూ వెళ్లారు. అలాగే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డా. నాగార్జునరెడ్డి, వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు జాషువా, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సాయిదత్తలను ఈడ్చుకుపోయి అరెస్ట్‌ చేశారు. మొత్తం 57 మంది వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్ట్‌ చేసి సొంత పూచీకత్తుపై మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు పి. జయచంద్రారెడ్డి, బీహెచ్‌ ఇలియాస్‌, ఫయాజ్‌, అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

మహిళానేతలను అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు

వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శివరామ్‌ను ఈడ్చుకెళుతున్న పోలీసులు

కడప అర్బన్‌: వైఎస్‌ఆర్‌సీపీ మనోభావాలను దెబ్బతీసేలా, మహిళలను అవమానించేలా తప్పుడు, దురుద్దేశపూరిత వార్తలు ప్రచురించిన రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. కడప నగరంలోని వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మాజీ డిప్యూటీ సీఎం, కడప నియోజకవర్గ సమన్వయకర్త ఎస్‌బీ అంజద్‌బాషా, సీఈసీ సభ్యులు కె. సురేష్‌ బాబుతో పాటు, నాయకులు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తూ, మహిళల గౌరవాన్ని దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్న వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కో ఆప్షన్‌ సభ్యులు, జిల్లా, నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement