కడప కార్పొరేషన్: ఏబీఎన్ రాధాక్రిష్ణ సభ్యత, సంస్కారంతో మాట్లాడటం నేర్చుకోవాలని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, రాష్ట్ర కార్యదర్శులు ఉమామహేశ్వరి, రత్నకుమారి అన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాధాక్రిష్ణ వైఎస్సార్‌సీపీ నాయకుల భార్యలనే కాకుండా యావత్ మహిళా సమాజాన్ని కించపరిచేలా మాట్లాడారన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా నీచమైన, నికృష్టమైన భాష ఉపయోగించడం అనాగరికమన్నారు. మీడియా ముసుగులో రాధాక్రిష్ణ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకప్పుడు సైకిల్ మీద తిరిగే ఆయనకు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. మంచి, మర్యాద మరిచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల మెప్పు కోసం ఇలా దిగజారి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే నీవు జాకీలు పెట్టి లేపే పార్టీకి మహిళలు సమాధి కడతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో కో ఆప్షన్ సభ్యురాలు బి.మరియలు, శివమ్మ, దీప్తి పాల్గొన్నారు.
లేనిపక్షంలో గుణపాఠం తప్పదు
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నేతల హెచ్చరిక


