కడప నగరంలో డ్రోన్ కెమెరాలతో పెడుతున్న నిఘా నేత్రం తూతూ మంత్రంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్పీ షెల్కే నచ్చికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీ పోలీసులతో, ఆయా పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెడుతున్నా కేవలం ప్రచారానికే పరిమితమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆయా ఫొటోలను తమ ఉన్నతాధికారికి పంపిస్తూ తామేదో చేస్తున్నామనే ఆర్భాటమే తప్పా.. ఆచరణలో నిఘా కరువైందని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇప్పటికై నా చిత్తశుద్ధితో వ్యవహరించి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని.. గంజాయి బ్యాచ్ ఆకృత్యాలను అణచి వేయాలని ప్రజలు కోరుతున్నారు.


