సంఘ సంస్కర్త బాబూ జగ్జీవన్‌ రామ్‌ | - | Sakshi
Sakshi News home page

సంఘ సంస్కర్త బాబూ జగ్జీవన్‌ రామ్‌

Apr 6 2026 7:42 AM | Updated on Apr 6 2026 7:42 AM

కడప కార్పొరేషన్‌ : బాబూ జగ్జీవన్‌ రామ్‌ గొప్ప సంఘ సంస్కర్త అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతిని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రవీంద్రనాథ్‌రెడ్డితోపాటు మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుధ ముఖ్య అతిథులుగా హాజరై జగ్జీవన్‌ రామ్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీహార్‌లోని వెనుకబడిన వర్గాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జగ్జీవన్‌ రామ్‌ పార్లమెంటులో నలభై ఏళ్లపాటు వివిధ మంత్రిపదవులు నిర్వహించారని, భారత దేశానికి ఉప ప్రధానిగా సేవలందించారని కొనియాడారు. అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్‌ ఇండియా డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగ్‌ సంస్థను స్థాపించారన్నారు. కార్మిక శాఖామంత్రిగా, రక్షణ మంత్రిగా, న్యాయ శాఖామంత్రిగా ఆయన అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు షఫీ, యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, అబ్దుల్‌సుభాన్‌, సింధే రవి పాల్గొన్నారు.

నివాళి

బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా కడప నగరంలోని మహా వీర్‌ సర్కిల్‌లో ఉన్న బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యులు కె. సురేష్‌ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుధ లు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ మేయర్‌ పాకా సురేష్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు సింగమాల వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, వైఎస్సార్‌సీపీ నాయకులు త్యాగరాజు, కె. బాబు, సుబ్బరాయుడు, సీహెచ్‌ వినోద్‌ కుమార్‌; దాసరి శివప్రసాద్‌, రామ్మోహన్‌రెడ్డి, షఫీ, సాయి, రవి పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

పి.రవీంద్రనాథ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement