9న జిల్లా స్థాయి మహిళల హాకీ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

9న జిల్లా స్థాయి మహిళల హాకీ ఎంపికలు

Apr 7 2026 7:43 AM | Updated on Apr 7 2026 7:43 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: జిల్లా మహిళల జూనియర్‌, సీనియర్‌ ఎంపికలు ఈ నెల 9న నగర శివార్లలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ క్రీడా పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్‌ కా ర్యదర్శి శేఖర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు జూనియర్‌ విభాగంలో 01–01–2007 తరువాత జన్మించి ఉండాలని పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడా కారిణులు తమ ఆధార్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్స్‌, పదో తరగతి మార్క్‌ లిస్ట్‌ తీసుకురావాలన్నారు. ఎంపికైన జూనియర్‌ జిల్లా జట్టు ఈనెల 16 నుంచి 18 వరకు చిత్తూరులో జరగబోయే రాష్ట్ర స్థాయి జూనియర్‌ టోర్నమెంట్‌లో పాల్గొంటారన్నారు. అలాగే సీనియర్‌ మహిళల ఎంపికలు కూడా నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 86884 46515 అనే నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

‘డయల్‌ యువర్‌ ఎస్‌ఈ’కి స్పందన

కడప కార్పొరేషన్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ‘డయల్‌ యువర్‌ ఏపీఎస్‌పీడీసీఎల్‌ ఎస్‌ ఈ’ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. సోమవారం విద్యుత్‌ భవన్‌లోని ఎస్‌ఈ ఛాంబర్‌లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 9 మంది వినియోగదారులు మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ ద్వారా విద్యుత్‌ సమస్యలను వివరించారు. ఎస్‌ఈ ఎస్‌. శ్రీనివాసులు వారి సమస్యలను విని సంబంధిత అధికారులకు తక్షణ చర్యల కోసం బదిలీ చేశారు. వినియోగదారుల సమస్యలను స్వయంగా పరిశీలించి, సాధ్యమైన పరిష్కారాలు తీసుకోవడం ఏపీఎస్‌పీడీసీఎల్‌ లక్ష్యమని ఆయన తెలిపారు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ మధుసూదన్‌, డీఈఈలు మోహన్‌, నాగముని స్వామి, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ శ్యామ్‌ పాల్గొన్నారు.

నోటిఫికేషన్‌ రద్దు

కడప కోటిరెడ్డి సర్కిల్‌ : ఫ్రంట్‌ ఆఫీస్‌ కో–ఆర్డినేటర్‌ పోస్టు భర్తీకి సంబంధించి గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌లో లోపాలు ఉన్నందున వాటిని రద్దు చేశామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.యామిని తెలిపారు. ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారటి ఆదేశాల మేరకు ఆ నోటిఫికేషన్‌లో జరిగిన ఎంపిక ప్రక్రియను రద్దు చేశారని, త్వరలో కొత్త నోటిఫికేషన్‌ జారీ చేస్తారని పేర్కొన్నారు. స్థానికులు, స్థానికేతర అభ్యర్థులు ఇద్ద రు దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదన్నారు. కొత్తగా దరఖాస్తు చేసే అభ్యర్థులు మాత్రమే పరీక్ష చెల్లించాలని, నోటిఫికేషన్‌ వివరాలను త్వరలో తెలియజేస్తామని ఆమె తెలిపారు.

అధిక ఉష్ణోగ్రతలతో అప్రమత్తం!

కడప సెవెన్‌రోడ్స్‌: అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి సూచించారు. సోమవారం జిల్లా సచివాలయంలోని సభా భవన్‌లో కలెక్టర్‌, జేసి నిధి మీనాతో కలసి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణకు సంబంధించిన అవగాహన పోస్టర్లను విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement