కడప ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం సోమవారం కడపలోని మున్సిపల్ హైస్కూల్ మెయిన్‌లో ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ మూల్యాంకనానికి క్యాంపు ఆఫీసర్‌గా డీఈఓ షేక్ షంషుద్దీన్ వ్యవహరించారు. ఈ మూల్యాంకనానికి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి అన్ని సబ్జెక్టులకు సంబంధించి 1,95,674 పేపర్లు వచ్చాయి. ఈ మూల్యాంకన విధుల్లో 94 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 540 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు 270 మంది స్పెషల్ అసిస్టెంట్లు పాల్గొని 7824 పేపర్లకు మూల్యాంకనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపు ఆఫీసర్, డీఈఓ షేక్ షంషుద్దీన్ మాట్లాడుతూ మూల్యాంకన కేంద్రంలో పేపర్లను దిద్దే సిబ్బంది అన్ని జాగ్రత్తలను పాటిస్తూ పేపర్లను మూ ల్యాంకనం చేయాలన్నారు. జవాబు పత్రాలను క్షుణంగా పరిశీలించి మార్కులను వేయాలన్నారు. మూల్యాంకన విధులకు హజరయ్యే సిబ్బంది కచ్చితంతా సమయపాలన పాటించాలన్నారు. మూల్యాంకన కేంద్రంలో ఎవరు కూడా సెల్‌పోన్‌లను వినయోగించరాదని... దీంతోపాటు మూల్యాంకన విధులకు వచ్చే సిబ్బంది ఖచ్చితంగా గుర్తింపు కార్డులను ధరించాలని సూచించారు.
మూల్యాంకన కేంద్రాన్ని
పరిశీలించిన ఆర్‌జేడీ...
మున్సిపల్ హైస్కూల్ మొయిన్‌లో జరుగుతున్న మూల్యాంకన కేంద్రాన్ని పాఠశాల విద్య ఆర్‌జేడీ కాగిత శ్యాముల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన డీఈఓ షేక్ షంషుద్దీన్‌తో కలిసి మూల్యాంకన కేంద్రంలో పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు సలహాలను ఇచ్చారు. డిప్యూటీ క్యాంపు ఆఫీసర్ రాజగోపాల్‌రెడ్డి, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శ్రీకాంత్, ఎంఈఓలు, మూల్యాంకన సిబ్బంది పాల్గొన్నారు.
తొలిరోజు 7824 సమాధాన
పత్రాలకు మూల్యాంకనం


