3ఎకరాలలో అరటి సాగు చేశా | - | Sakshi
Sakshi News home page

3ఎకరాలలో అరటి సాగు చేశా

Apr 7 2026 7:43 AM | Updated on Apr 7 2026 7:43 AM

3ఎకరాలలో అరటి సాగు చేశా గొర్రెలకు మేతగా వేస్తున్నాం ధరల్లేక అరటి సాగులో నష్టాలు

నేను మూడెకరాలలో అరటి సాగు చేశా. సాగులో ఎకరాకు లక్ష రూపాయల మేర పెట్టుబడులు పెట్టా. ఫిబ్రవరి వరకు ధరలు ఉండటంతో గెలలు కోతకు వచ్చే సమయానికి ఇవే ధరలు ఉంటాయని ఆశించాం. ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో వ్యాపారులు రావడంలేదు. అరటి సాగులో తీవ్రంగా నష్టపోతున్నా. – రామిరెడ్డి, అరటి రైతు, గొందిపల్లె

అరటి ధరలు మార్కెట్‌లో పడిపోవడంతో వ్యాపారులు కొనుగోళ్లకు ముందుకు రావడంలేదు. తోటలలో అరటి గెలలు మాగిపోతున్నా యి. మాగిన అరటి గెలలను ట్రాక్టర్‌తో తరలించి గొర్రెలకు మేతగా వేస్తున్నాం. ఐదెకరాలలో అరటి సాగుకు రూ. 4లక్షల మేర పెట్టుబడులు పెట్టా. పెట్టుబడులు కూడా రావడం ల్యా.

– శివశంకర్‌రెడ్డి,

అరటి రైతు, మబ్బుచింతలపల్లె

ఈ ఏడాది మార్కెట్‌లో అరటి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. రెండవ, మూడవ పంటలకు ఉన్న ధరలు మొదటి పంటలో దిగుబడులు వచ్చేసరికి ధరలు లేకుండా పోయాయి. ఆమాంతం ధరలు లేకపోవడంతో వ్యాపారులు కూడా కొనుగోళ్లకు ఆసక్తి చూపలేదు. ధరలు లేకపోవడంతో సాగులో రైతులు నష్టాలను చవి చూడాల్సి వస్తోంది.

– రాఘవేంద్రారెడ్డి, హెచ్‌ఓ, పులివెందుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement