30 శాతం ఐఆర్‌ వెంటనే ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

30 శాతం ఐఆర్‌ వెంటనే ప్రకటించాలి

Apr 6 2026 7:42 AM | Updated on Apr 6 2026 7:42 AM

కడప ఎడ్యుకేషన్‌ : 12వ పీఆర్సీ ఏర్పాటు చేయడంతోపాటు 30 శాతం మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం కడపలోని ఎస్టీయూ భవన్‌లో జిల్లా అధ్యక్షుడు ఎన్‌.సంగమేశ్వరరెడ్డి అధ్యక్షతన ఫ్యాప్టో ప్రథమ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునాధరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచి, ఇచ్చిన హామీల అమలుతో పాటు,12వ పీఆర్సీ, మధ్యంతర భృతి అమలు చేయాలనే డిమాండ్‌తో ఎస్టీయూ పక్షాన పలు రకాల ఉద్యమాలు చేపట్టామన్నారు. అయినా సరే అర కొర పెండింగ్‌ బిల్లుల చెల్లింపులు తప్ప,మిగిలిన వాటిని పట్టించుకోలేదన్నారు.ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆధ్వర్యంలో నిర్వహించబోయే మలిదశ ఉద్యమానికి సిద్ధం కావాలని ఎస్టీయూ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయవాణి ప్రధాన సంపాదకులు కె.వి.శేఖర్‌, ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు సంగమేశ్వరరెడ్డి, పాలకొండయ్యలు మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్‌ గాలి చంద్ర, ఏఐటీయూసీ రాష్ట్రనాయకులు ఎల్‌. నాగసుబ్బారెడ్డి, ఎస్టీయూ రాష్ట్రకార్యవర్గ సభ్యులు ఇలియాస్‌ బాష, క్రిష్ణారెడ్డి, దాదాపీర్‌,ఏఐఎఫ్‌ఈటీఓ జాతీయకార్యదర్శి పి.రమణారెడ్డి, ఎస్టీయూ సీనియర్‌ నాయకులు సురేష్‌ బాబు, జయరామయ్య, చింతంరెడ్డి రామచంద్రారెడ్డి,సుధాకర్‌ రెడ్డి,జిల్లా ఆర్థిక కార్యదర్శి యు.సుబ్రహ్మణ్యం, జిల్లాకార్యవర్గ సభ్యులు, రాష్ట్రకౌన్సిలర్లు, రీజనల్‌ కన్వీనర్లు,మండలశాఖల అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement