కడప అనంతపురం జట్ల విజయం | - | Sakshi
Sakshi News home page

కడప అనంతపురం జట్ల విజయం

Apr 5 2026 7:54 AM | Updated on Apr 5 2026 7:54 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–23 అంతర్‌ జిల్లాల వన్డే మ్యాచ్‌ విజేతగా అనంతపురం జట్టు నిలిచింది. అంతర్‌ జిల్లాల వన్డే మ్యాచ్‌లో అన్ని జట్లు నాలుగేసి మ్యాచ్‌లు ఆడగా అనంతపురం జట్టు 1.037 నెట్‌ రన్‌రేట్‌తో 12 పాయింట్లతో విజేతగా నిలవగా కర్నూలు జట్టు 12, కడప జట్టు 8, నెల్లూరు 4, చిత్తూరు 4 పాయింట్లు సాధించాయి. శనివారం వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అనంతపురం జట్టు, కెఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కడప జట్టు విజయం సాధించాయి.

వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అనంతపురం, నెల్లూరు జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన అనంతపురం జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 363 పరుగులు చేసింది. ఆ జట్టు లోని హానీష్‌ వీరారెడ్డి79 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 125 పరుగులు చేశాడు. అర్జున్‌ టెండూల్కర్‌ 52 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని సూతేజ్‌రెడ్డి 6 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌ను ప్రారంభించిన నెల్లూరు జట్టు నిర్ణీత 49.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. ఆ జట్టులోని పవన్‌ రిత్విక్‌ 79, పూర్ణ చంద్ర గణేష్‌ 47 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని అర్జున్‌ టెండూల్కర్‌ 3, ప్రమో ద్‌ కుమార్‌ 2 వికెట్లు తీశారు. దీంతో అనంతపురం జట్టు 114 పరుగులు తేడాతో విజయం సాధించింది.

కెఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో చిత్తూరు–కడప జట్టు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన చిత్తూరు జట్టు బ్యా టింగ్‌ ఎంచుకుంది. 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. ఆజట్టులోని తేజరెడ్ది 112 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌ను ప్రారంభించిన కడప జట్టు నిర్ణీత 43.5 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 331 పరుగులు చేసింది. ఆ జట్టులోని ప్రణవ్‌రెడ్డి 101, విజయ్‌ రామ్‌రెడ్డి 76, సయ్యద్‌ మహ్మద్‌ 52 పరుగులు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement