పులివెందుల రూరల్ : పట్టణంలోని స్థానిక నారాయణ పాఠశాల వెనుకవైపున గురువారం రాత్రి బాలుడిపై కుక్క లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. భరత్ అనే బాలుడు సైకిల్‌పై ఇంటికి వెళుతుండగా కుక్కలు వెంబడించి దాడి చేశాయి. దాడిలో గాయపడిన భరత్‌ను వెంటనే తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు స్పందించి పట్టణంలో కుక్కల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి..
అట్లూరు : ఎదురెదురుగా వస్తూ ద్విచక్రవాహనాలు ఢీకొని ఇరువురికి తీవ్రగాయాలైన సంఘటన కడప – బద్వేలు ప్రధాన రహదారిపై బద్వేలు మండలం వెంకటశెట్టిపల్లె గ్రామ సమీపాన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానిక వివరాల మేరకు అట్లూరు మండలం ఎర్రబల్లి గ్రామానికి చెందిన పిన్నపురెడ్డి చెన్నసుబ్బారెడ్డి తన ద్విచక్రవాహనంపై బద్వేలుకు వెళుతుండగా సిద్ధవటం మండలం ఖాదర్‌బంగ్లాకు చెందిన నందీశ్వర్ ద్విచక్రవాహనంపై బద్వేలు నుంచి సిద్ధవటంకు వస్తూ వెంకటశెట్టిపల్లె వద్ద ఇరు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
బద్వేలు అర్బన్ : బద్వేలు అర్బన్ పోలీసుస్టేషన్ పరిధిలోని పెద్దచెరువు కట్ట సమీపంలో గల అచ్చెమ్మగుడి పక్కనే ఉన్న ముళ్లపొదల్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతిచెందినట్లు అర్బన్ సీఐ బి.రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం మృతదేహాన్ని గుర్తించినప్పటికీ నాలుగైదు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ఆయన తెలిపారు. మృతుడు సుమారు 40–45 సంవత్సరాల వయస్సులోపు ఉండి బ్లూకలర్ షర్ట్, నల్లని ఫ్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఎవరనేది తెలియడం లేదని, మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే అర్బన్ పోలీసులను సంప్రదించడం గాని 9121100626, 9121100627 నెంబర్లను సంప్రదించాలని కోరారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.
ఇరువర్గాలపై కేసు నమోదు
కొండాపురం: మండల పరిధిలోని తాళ్లప్రొద్దుటూరు గ్రామంలోని బీసీ కాలనిలో దేవరింటి పవన్‌కుమార్ పై అదే గ్రామానికి చెందిన జనసేన నాయకుడు నరసింహాకు పాత కక్షల కారణంతో గొడవ జరిగింది. ఈ ఘటన పై తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ మంజునాథ ఇరువర్గాలపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వివరాలిలా.. తాళ్లప్రొద్దుటూరు గ్రామంలో గురువారం రాత్రి జరిగిన పాతగొడవలు కారణంతో జనసేన నాయకుడు నరసింహా మరో ఐదుగురు కలసి దేవరింటి పవన్‌కుమార్‌ను కొట్టడంతో తలకు గాయమైంది. రెండు పళ్లు ఊడిపోయాయి. ఈఘటన పై జనసేన నాయకుడుతో పాటు ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు. అదే గ్రామానికి చెందిన లక్ష్మిదేవిని దేవరింటి పవన్ కాలితో తనడంతో అతనిపై కేసు నమోదు చేశామన్నారు.
పులిచెర్ల(కల్లూరు): కల్లూరు మాజీ సర్పంచ్ ఎస్.షుకూర్ తన అనుచరులతో కలిసి శుక్రవారం మాజీ మంత్రి, పుంగనూరు శాసన సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో తిరుపతిలో ఆయన స్వగృహంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ కండువాకప్పి పెద్దిరెడ్డి ఆయన్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.


