● రోడ్డు ప్రమాదంలో కడప యువకుడు మృతి
● మరో యువకుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్: ఆ ఇద్దరు ఉన్నత చదువులు చదువుకున్న విద్యా వంతులు. డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్నారు. ఇంతలో బెంగళూరులో ఉన్న తన చిన్న నాటి స్నేహితుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే తమకు చిన్న జాబ్ ఇప్పించాలని అభ్యర్తించారు. అందుకు ఆ స్నేహితుడు బెంగళూరు వస్తే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో కడపకు చెందిన ఇద్దరు స్నేహితులు బెంగళూరుకు బైకులో శుక్రవారం ఉదయం బయలు దేరారు. మదనపల్లె– కర్ణాటక సరిహద్దున రాయల్పాడు వద్ద లారీ మృత్యువు రూపంలో వారికి ఎదురుగా వచ్చింది. ఆ లారీని తప్పించే క్రమంలో బైకు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న సైడ్ వాల్‌ను ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరి స్నేహితుల్లో ఒకరు అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరోకరు కొన ఊపిరితో ఉండడంతో స్థానికులు గుర్తించి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషాదకర ఘటనపై రాయల్పాడు ఎస్‌ఐ శివకుమార్ తెలిపిన వివరాలిలా.. కడప పట్టణం, రాజారెడ్డి వీధికి చెందిన ఉమా మహేశ్వర్ (25), సబ్ జైలు వీధికి చెందిన దీవన (24)లు, బైకులో బెంగళూరులో ఉన్న స్నేహితునికి వద్దకు ఉద్యోగం వెతకడానికి బయలు దేరారు. మదనపల్లె – కర్ణాటక లోని రాయల్పాడు సమీపానికి రాగానే ఎదురుగా వచ్చిన ఓ లారీని తప్పించ బోయి రోడ్డు పక్కనే ఉన్న సేప్టి వాల్ ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో దీవన అక్కిడి కక్కడే దుర్మరణం చెందగా అతని స్నేహతుడు ఉమ హహేశ్వర్ తీవ్రంగా గాయపడడంతో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అతడి పరిస్థితి ఆందోళన కరంగా ఉందని చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబీకులు బాధితున్ని కడపకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
మృతిచెందిన దీవన
తీవ్రంగా గాయపడిన ఉమమహేశ్వర్


