4న పెంపుడు కుక్కల ప్రదర్శన
ప్రొద్దుటూరు: మండలంలోని గోపవరం వద్ద ఉన్న పశువైద్య కళాశాల మైదానంలో ఫిబ్రవరి 4వ తేదీ పెంపుడు కుక్కల ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ వారు ఒక ప్రకటనలో తెలిపారు. పెంపుడు కుక్కలను ప్రోత్సహించడానికి, కుక్కల పెంపకంలో మెలకువలు తెలుసుకోవడానికి తొలిసారి ప్రదర్శన నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రదర్శనలో పా ల్గొనదలచిన వారు 72071 69193, 83329 02453 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
ప్రొద్దుటూరు: పన్ను వసూలుపై పలువురు సచివాలయ వార్డు కార్యదర్శులకు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాపర్టీ టాక్స్, వాటర్ టాక్స్, ట్రేడ్ అరియర్స్, లైసెన్స్ ఫీజు వసూలు చే యడంలో నిర్లక్ష్యం వహించడంపై సంజాయిషీ ఇవ్వాలని కమిషనర్ నోటీసులో పేర్కొన్నారు.
నందలూరు: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించగా రూ.7,30,879 వచ్చినట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్ తెలిపారు. 30 రోజులకు వచ్చిన ఆదాయాన్ని లెక్కించామన్నా రు. ఆలయ సూపరింటెండెంట్ హనుమంత య్య, విజిలెన్స్ అధికారి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
కడప సెవెన్‌రోడ్స్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జమ్మలమడుగు మండలంలోని ఎస్.ఉప్పలపాడు ఆదర్శ గ్రామంలో పర్యటించారు. ఈ మేరకు మంగళవాం కడప విమానాశ్రయానికి చేరుకోగా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్,జిల్లా జాయింట్ కలెక్టర్ డా.నిధి మీనా పుష్ప గుచ్చంతో స్వాగతం పలికారు. వీరి వెంట తెలంగాణ ప్రొహిబిషన్ – ఎకై ్సజ్ శాఖ డైరెక్టర్ సి.హరికిరణ్ ఉన్నారు.
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఈ నెల 27 నుంచి నిర్వహించనున్న ఇంటర్ ఒకేషనల్ ప్రాక్టికల్స్‌తోపాటు జనరల్ ప్రాక్టికల్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్‌ఓ విశ్వేశ్వరనాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని డీఆర్‌ఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో ఎక్కడ ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. ఇంటర్మీడియట్ ఆర్‌ఐవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 81 పరీక్షా కేంద్రాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా సుమారుగా 13825 మంది జనరల్ ప్రాక్టికల్స్‌కు, 2422 మంది విద్యార్థులు ఒకేషనల్ ప్రాక్టికల్స్‌కు హాజరవుతారని తెలిపారు. విద్యార్థుల సహాయం కోసం కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08562 244171ను ఏర్పాటు చేయనున్నామన్నారు.
సిద్దవటం: నిత్యపూజ స్వామి తలనీలాల వేలం పాట రూ.7.10 లక్షలు పలికిందని ఆలయ ఈఓ శ్రీధర్ తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి భక్తుల తలనీలాల పోగు హక్కు కోసం సిద్దవటం రంగనాథస్వామి ఆలయంలో మంగళవారం బహిరంగ వేలం పాట నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 17 మంది లక్ష రూపాయలు డిపాజిట్ చెల్లించి పాటలో పాల్గొనగా.. గుంతకల్‌కు చెందిన చక్రధర్ రూ.7.10 లక్షలకు పాటను దక్కించుకున్నారని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ జనార్ధన్, ఆలయ ఈఓ శ్రీధర్ అన్నారు. గత ఏడాది కంటే రూ.1.59 లక్షల ఆదాయం ఎక్కువగా వచ్చిందని తెలిపారు. ఆలయ ఛైర్మన్ రాజేంద్రప్రసాద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
4న పెంపుడు కుక్కల ప్రదర్శన
4న పెంపుడు కుక్కల ప్రదర్శన


