బాబు పాలనలో డ్రగ్స్ కారిడార్‌గా రాష్ట్రం
కడప సెవెన్‌రోడ్స్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో గంజాయి, కొకైన్, ఎండీఎంఏ లాంటి డ్రగ్స్‌కు కారిడార్‌గా రాష్ట్రం మారిందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ఆరోపించారు. మంగళవారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. యువత డ్రగ్స్‌తో నాశనం అవుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. మితిమీరిన రాజకీయ జోక్యంతో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందన్నారు. వైఎస్‌జగన్ ప్రభుత్వం పేకాట క్లబ్బులను నిషేధించగా, బాబు సర్కార్ వాటికి పునర్జీవం పోసిందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలే స్వయంగా పేకాట క్లబ్బులు, క్యాసినోలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. సంక్రాంతి సందర్భంగా రూ. లక్ష ఎంట్రీ ఫీజుతో భారీ బందోబస్తు మధ్య పేకాట క్లబ్బులు నిర్వహించారన్నారు. అపా ర్టుమెంట్స్, రిసార్ట్స్, మూతపడ్డ సినిమా హాళ్లలో పేకాట విచ్చలవిడిగా సాగుతోందన్నారు. మహిళా హోం మంత్రి వీరిని అరికట్టాల్సిందిపోయి కోడి పందేల్లో నిమగ్నం కావడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఇక టీడీపీ నేతలు కల్తీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కనుసన్నల్లోనే మద్యం మాఫియా నడుస్తోందని ఆరోపించారు.పేద రైతుల నుంచి అమరావతిలో ల్యాండ్ ఫూలింగ్ పేరిట ప్రభుత్వం పొలాలను సేకరిస్తోందన్నారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు టోల్ వద్ద 2.4 ఎకరాల పవన్ కల్యాణ్‌కు చెందిన భూమిని ఫూలింగ్ నుంచి ఎందుకు మినహాయించారో చెప్పాలని ప్రశ్నించారు. స్కిల్ స్కామ్‌లో రూ. 360 కోట్లు బాబు జేబులోకి వెళ్లిందన్నారు. కంపెనీ యజమానులే తాము ఎంఓయూ చేసుకోలేదని స్పష్టం చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రీ సర్వే రాళ్ల పేరుతో రూ. 700 కోట్ల స్కామ్ జరిగిదంటూ ఎన్నికల సందర్బంలో ఆరోపణలు గుప్పించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అదే రీ సర్వేను ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పాలన్నారు. కార్పొరేటర్ షఫీ, జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి, నాయకులు రమేష్‌రెడ్డి, దాసరి శివప్రసాద్, రామ్మోహన్‌రెడ్డి, నాగయ్య యాదవ్, జమీల్ పాల్గొన్నారు.
బాబు, లోకేష్ కనుసన్నల్లో మద్యం మాఫియా
అడ్డగోలుగా ప్రభుత్వ భూముల సంతర్పణ
మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ధ్వజం


