కక్ష సాధింపు
కూటమి ప్రభుత్వం అన్ని విషయాల్లో కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తోంది. అందులో భాగంగానే కాలేటి వాగు నిర్మాణ పనులను ఆపివేసింది. వైఎస్సార్ సీపీకి చెందిన వ్యక్తులు కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పనులు ఆగిపోయి రైతాంగానికి నిరాశే మిగిలింది. – బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి,
వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్, చక్రాయపేట
రైతులపై కపట ప్రేమ
చంద్రబాబు ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూపిస్తోంది. రైతులకు ఏదో ఒరగబెడతామని ప్రగల్భాలు పలుకుతుందే తప్ప చేసేది మాత్రం శూన్యం. ఉచిత పంటలబీమా రద్దు చేయడం, ఉన్న ప్రాజెక్టు పనులను కొనసాగించకుండా అనేక సాకులు చూపి నిర్మాణాలు ఆపడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. – ఎల్‌ఎన్ కృష్ణారెడ్డి,
జిల్లా రైతు విభాగ కార్యదర్శి, వైఎస్సార్ సీపీ
రైతుల్లో వ్యతిరేకత
కూటమి ప్రభుత్వంపై అనతికాలంలోనే రైతుల్లో వ్యతిరేకత వచ్చింది. రైతుల విషయానికి వచ్చేకొద్ది మాటలు తప్ప చేతల్లో చూపించడం లేదు. బీమా విషయంలో నిర్లక్ష్యం? అన్నదాత సుఖీభవ పథకంలో కోతలు, ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో అలసత్వం.. ఇలా అన్నింట్లోనూ కక్షగట్టింది. దీంతో రైతులు కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. – తాడిగొట్ల శివప్రసాద్‌రెడ్డి,
జెడ్పీటీసీ సభ్యుడు, చక్రాయపేట
ప్రభుత్వ నిర్ణయం మేరకే పనులు
కాలేటి వాగు నిర్మాణ పనులపై ప్రభుత్వ ఆదేశాలతోనే పనులు నిర్వహిస్తాం. ప్రస్తుతం జరిగిన పనులపై విజిలెన్స్ తనిఖీలు చేపట్టాం.ప్రస్తుత టెండరును రద్దు చేసింది. రీ టెండర్ల ను పిలిచే అవకాశం ఉంది.–మధుసూదన్‌రెడ్డి,
ఈఈ, నీటిపారుదలశాఖ డివిజన్–1, కడప
కక్ష సాధింపు
కక్ష సాధింపు


