వైఎస్సార్ సీపీలో నియామకాలు
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కమిటీలో జిల్లా వాసిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కడప నగరానికి చెందిన కొర్ర శివ సుదర్శన్ రెడ్డిని రాష్ట్ర న్యాయ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించింది.
సాక్షి అన్నమయ్య : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల కమిటీలలో జిల్లాకు చెందిన పలువురిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర లీగల్ సెల్ కమిటీలో... జనరల్ సెక్రటరీగా వీసీ రెడ్డెప్పరెడ్డి (రాయచోటి), సెక్రటరీగా ఎన్.శ్రీనివాస్‌రెడ్డి (రాయచోటి), జాయింట్ సెక్రటరీలుగా ఎం.గోవర్దన్‌రెడ్డి (రాజంపేట), టి.ఆనంద్ యాదవ్ (మదనపల్లె)లు నియమితులయ్యారు.
జిల్లా అనుబంధ విభాగ కమిటీలలో..
జిల్లా యూత్ వింగ్ సెక్రటరీగా యండపల్లి శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శిగా షేక్ మహమ్మద్ రఫీ, జిల్లా పబ్లిసిటీ విభాగం కార్యదర్శిగా షేక్ రెడ్డి గఫార్, జిల్లా సోషల్ మీడియా విభాగ కార్యదర్శిగా మండెం రాఘవేంద్రలను నియమితులయ్యారు. వీరందరూ రాయచోటి నియోజకవ ర్గానికి చెందిన వారే.
నేడు బోయకొండలో
హుండీ ఆదాయం లెక్కింపు
చౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం ఉదయం 7 గంటలకు హుండీ కానుకలను లెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆలయ ఈఓ ఏకాంబరం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమానికి బ్యాంకు, ఆలయ, పోలీసు సిబ్బంది హాజరు కావాలని కోరారు.


